Header Banner

భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్! కేంద్రానికి విజ్ఞప్తి!

  Tue Apr 29, 2025 19:31        Others

పహల్గాం దాడి కారణంగా పాకిస్థాన్‌తో సంబంధాలను భారత్ పూర్తిగా తెగతెంపులు చేసుకొంది. ఈ నేపథ్యంలో భారత్‌లో నివసిస్తున్న పాకిస్థానీలను వెంటనే దేశం విడిచి వెళ్లేలా ఆదేశాలు జారీ చేసింది. అందుకు సంబంధించిన గడువు సైతం తీరిపోవచ్చింది. అలాంటి వేళ పాకిస్థాన్‌కు చెందిన మరియం ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేసింది.

 

 

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఆంక్షలు విధించింది. దీంతో పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. అందుకు గడువు సైతం విధించింది. ఆ గడువు ఈ రోజుతో అంటే ఏప్రిల్ 29వ తేదీతో ముగియనుంది. ఆ క్రమంలో ఇప్పటికే చాలా మంది పాకిస్తానీలను భారత్ నుంచి స్వదేశానికి పంపించి వేసింది. అలాంటి వేళ.. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జన్మించి.. ఉత్తరప్రదేశ్‌లో తన భర్తతో నివసిస్తున్న మరియం మంగళవారం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తన భర్తతో కలిసి భారత్‌లోనే నివసించేలా తనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.

 

ఇది కూడా చదవండి6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

మూడేళ్ల క్రితం పెళ్లి..

మూడు సంవత్సరాల క్రితం.. బులంద్‌షహర్‌ జిల్లాలోని ఖుర్జా నివాసి అమీర్‌ను మరియం వివాహం చేసుకుంది. రెండు నెలల క్రితం ఆమె స్వల్పకాలిక వీసా పొంది.. భర్తతో కలిసి ఖుర్జాలో నివసిస్తోంది. తాను ఇస్లామాబాద్ వదిలి భారత్ వచ్చానని తెలిపింది. ప్రస్తుతం ఇది తన దేశమని కేంద్రానికి చేసిన విజ్జప్తిలో స్పష్టం చేసింది. తాను తిరిగి వెళ్లాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. గతంలోనే తాను దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసినట్లు గుర్తు చేసింది.

 

పహల్గాం ఘటనపై స్పందన..

మరోవైపు పహల్గామ్ దాడిపై ఈ సందర్భంగా మరియం విచారం వ్యక్తం చేసింది. ఈ ఉగ్రదాడి ఘటన చూసి తాను చాలా కలత చెందనన్నారు. ఈ చర్యకు పాల్పడిన బాధ్యలను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే మరియం పరిస్థితిపై జిల్లా ఎస్పీ తేజ్‌వీర్ సింగ్ స్పందించారు. ఆమె తన దరఖాస్తును తమకు సమర్పించారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

యూపీలో ఉన్న ఒకే ఒక్క..

బులంద్‌షహర్‌లో స్వల్పకాలిక వీసాలపై నివసిస్తున్న నలుగురు పాకిస్తానీ మహిళలను కేంద్రం ఆదేశాల మేరకు ఇప్పటికే వారి దేశానికి పంపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. జిల్లాలో ఉన్న ఏకైక పాకిస్తానీ జాతీయురాలని ఈమెనని వివరించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ జాతీయులను వెనక్కి పంపాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.

 

 

యూపీ సీఎం ఆదిత్యనాథ్ సమీక్ష..

ఇంకోవైపు.. యూపీ సీఎం ఆదిత్యనాథ్.. ఆ రాష్ట్ర హోం శాఖ ఉన్నతాధికారులో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని నివసిస్తున్న పాకిస్తానీలను గుర్తించి వెంటనే దేశ సరిహద్దుల వరకూ తీసుకెళ్లాలని ఆదేశించారు.

 

ఇది కూడా చదవండిపలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #PahalgamAttack #IndiaPakistanRelations #DeportationOrders #PakistanNationals #MaryamAppeal #HumanRights #VisaIssue